Geetla Janardhan Reddy

0

మంథని కి చెందిన గిట్ల జనార్ధన్ రెడ్డి ప్రధానోపాధ్యాయునిగా ,సాహితి వేత్తగా ,రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. 1938 లో పుట్టిన అయన ఇంటర్ వరకు మంథని లో,డిగ్రీ వరంగల్ లో పూర్తి చేశారు .MA LLB చదివిన ఈయన 1960-70 మద్య కాలంలో జిల్లా లోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాటశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి విద్యాభివృద్దికి కృషి చేశారు .పాటశాల స్తాయీ నుండి సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్న జనార్ధన్ రెడ్డి ఉన్నత పాటశాలలో విజయ వార్షిక సంచికకు సంపాదకునిగా వ్యవహరించారు .ఇంటర్ లో జ్యోతి సంచికకు నాలుగు భాషాలలో రచనలు చేశారు .వ్యాసాలు ,కథలు,నాటికలు తెలుగు ,హింది ,ఉర్దూ ,ఇంగ్లీష్ భాషాలలో రచించి ఎన్నో బహుమతులు ,ప్రశంశలు అందుకున్నారు.అధ్యాపక జ్యోతి ,శంఖరావము ,క్రాంతి ప్రతికలకు సంపాదకునిగా పని చేశారు .మద్రాస్ లో జరిగిన అఖిల భారత విద్య మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధీగా హాజరు అయినారు .మౌంట్ అభూ లోని బ్రహ్మ కుమారి ఈశ్వరియ విద్యాలయం నిర్వహించిన కార్యక్రమాలకు వ్యక్తగా ,ఓ అంతర్జాతీయ చర్చ గోష్టికి అద్యక్షత వహించారు . ఆయన కలం నుంచి దుగ్దగిత ,ఆరని మంటలు ,జ్వాల తోరణం గ్రంధాలు ఆవిష్కృతమయయి.1970 గోదావరిఖని పంచాయతి సర్పంచుగా ఎన్నికయ్యారు. 1984 లో MLC గా అవకాశం దకించుకున్నారు. ఎన్టీఆర్ సన్నిహితునిగా గుర్తింపు పొందారు .

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.