Coriander Samosa

0

Ingredients

300gm kg కొత్తిమీర

100 gm పచ్చి కొబ్బరి

4 ఉల్లికాడలు

1 spoon జీలకర్ర

6,7 పచ్చి మిరపకాయలు

250 gm గోధుమపిండి

తగినంత ఉప్పు

నూనె

 

Steps

Step -01 : కొత్తిమీర శుభ్రం చేసుకుని కాసేపు ఆరనివ్వాలి .
Step -02 : ఒక బాణాలి లో సగం స్పూన్ నూనె వేసి జీలకర్ర చిన్నగా తరిగిన కొత్తిమీర ,పచ్చి మిరపకాయలు ,ఉల్లికాడలు, పచ్చి కొబ్బరి తురుము,ఉప్పు వేసి ఒక 5 నిముషాలు వేయించాలి ( కొత్తిమీర పొడి పొడిగా పచ్చిదనం లేకుండా కావాలి ) .
Step -03 : .గోధుమ పిండి లో 2 స్పూన్ వేడి నూనె వేసిఉప్పువేసి రోటీ పిండి కంటే గట్టిగా తడిపి పెట్టుకోవాలి .
Step -04 : గోధుమపిండి చిన్న చిన్నఉండలుగాచేసి రోటీ లాగా ఒత్తుకోవాలి. దాని మధ్యలో కత్తితో ఒక రేఖగీసి అర్ధ చంద్రాకారం గాకట్ చేయాలి అర్ధ చంద్రాకారాన్ని అంచులకు కాస్త నీరుఅంటించి ఒకవైపు మడిచి త్రికోణాకృతి లో ఫోల్డ్ చేసి మధ్యలో cone లాగా ఉన్న ఖాళీలో తాయారుచేసుకున్నమిశ్రమాన్ని నింపి చిన్న చిన్నసమోసాలు చేసుకుని బాణాలి లోతగినంత నూనెవేసి వేయించాలి.

అంతే చలికాలంలో వేడివేడి సమోసాలు తింటూ మీ వారు ”చౌద్వీకా చాంద్ హో యా అఫ్ తాబ్ హో….జోభిహో తుం ఖుదాకే కసం లాజవాబ్ హో ”అనడం ఖాయం !! పూదీనా చట్నీ ఉంటె భలే మజాగా ఉంటుంది !!

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.